RSS వ్యూహం..కాశ్మీర్ గవర్నర్ ఔట్..నెక్స్ట్ చంద్రబాబు తో..   RSS వ్యూహం..కాశ్మీర్ గవర్నర్ ఔట్..నెక్స్ట్ చంద్రబాబు తో..     2018-06-23   02:20:38  IST  Bhanu C

భారతీయ జనతా పార్టీ ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోందా ..షా మోడీ లా విధానాలతో విసిగెత్తి పోయిన RSS ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అవ్వబోతోందా అంటే అవుననే చెప్పాలి అయితే సీన్లోకి ఎంటర్ అవ్వబోవడం కాదు ఎప్పుడే ఎంటర్ అయ్యి చాపకింద నీరు లా తన వ్యుహాలని అమలుచేస్తోంది..పలు జాతీయ మీడియాలో కథనాలు ప్రకారం..RSS ఇప్పుడు ఎవరి మాటా వినే ఉద్దేశ్యంలో లేదట ఎందుకంటే దీనికి కారణం 2014 ఎన్నికల పరిస్థితులలో కంటే ప్రస్తుతం పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా విరుద్ధంగా ఉండటమే ఈ పరిస్థితికి కారణం అని అంటున్నారు….ఇదే వాతావరణం కొనసాగితే వచ్చే ఎన్నికలలో బీజేపీ దేశంలో ఉండదని అంచనా వేస్తోందట అంతేకాదు ఊహలకందని వ్యూహాలతో మోడీ షా లని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

ఇదిలాఉంటే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి RSS పూర్తి కసరత్తులు చేస్తోందట..అంతే కాకుండా ఇంకా జాతీయ మీడియా కథనాలను చాలా విషయాలు బయటపడ్డాయి..త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ మోడీ షా ల తీరుపై RSS గుర్రుగా ఉందట…కొన్ని రోజుల క్రితం హర్యాణాలోని సూరజ్కుండ్లో జరిగిన బీజేపీ, ఆరెస్సెస్ నేతల మధ్య మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చినట్టు జాతీయా మీడియా కథనాలు ప్రసారం చేసింది. అంతేకాకుండా ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ డ్రాప్ అవ్వడం వెనుక ఆర్ఎస్ఎస్ కారణమట.

అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అంటే…ఆ రాష్ట్రంలో పీడీపీ పార్టీతో పొత్తు వల్ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న హిందువుల్లో భారతీయ జనతా పార్టీపై నమ్మకం పోతుందని అలా జరగటం వల్ల బిజెపి చాలా సమస్యలు ఎదుర్కోవడం ఖాయమని దాంతో వెంటనే ఆర్ఎస్ఎస్ బిజెపి అధిష్టానానికి చెప్పడంతో వెంటనే భారతీయ జనతా పార్టీ పీడీపీ తో ఉన్న సంబంధాలను తెంచేసుకుంది…వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి గవర్నర్ పాలన ద్వారా హిందువులకు ఫేవర్ గా ఉంటూ బిజెపి పట్టు సాధించాలని భావిస్తోంది..

సరిగ్గా ఇదే సమయంలో ఏపీ విషయం కూడా చర్చకి వచ్చిందట..చంద్రబాబు నాయుడు బీజేపి కి చేసిన సపోర్ట్ ఎంతో ఉపయోగపడింది…ఎన్నికల సర్వే ఫలితాలు సైతం చంద్రబాబు కి అనుకూలంగా రావడం వంటి విషయాలు కూడా చర్చలోకి వచ్చాయట. దాంతో మరో మారు RSS బిజేపి పై మండిపడింది అని అంటున్నారు..ఈ క్రమంలో ఎన్నికలకుఅ ఇంకా సమయం ఉండటంతో ఏపీ కి ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ భావిస్తున్నారట.. అంతేకాదు…త్వరలో RSS తరపున సంధి దిశ గా చర్యలు మొదలవుతాయని తెలుస్తుంది..ఒకవేళ ఈచర్చలు ఫలిస్తే మాత్రం చంద్రబాబు కి ఏపీలో తిరుగులేనట్లే అంటున్నారు విశ్లేషకులు.

,