వెంకయ్య తో మోడీ కి చెక్..ఆరెస్సెస్ తాజా వ్యూహం

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.అప్పటి వరకూ మంత్రిగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యిపోవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మంత్రులుగా మారిపోవచ్చు ఊహించని పరిణామాలు అత్యంత వేగంగా జరగడం కేవలం రాజకీయాలలో మాత్రమె సాధ్యం అవుతుంది.

 Rss Proposal Next Pm Candidate Venkaiah Naidu-TeluguStop.com

అయితే గత కొన్ని రోజులుగా మోడీ ని ఈ సారి ప్రధాని అభ్యర్ధిగా తప్పించే పనిలో ఆరెస్సెస్ పావులు కడుపుతోందని అంటున్నారు విశ్లేషకులు అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా చక చకా కదులుతున్నాయని తెలుస్తోంది.

అయితే ఈ పరిణామాలు మోడీ టీం కి నిద్రపట్టకుండా చేస్తున్నాయి.మోదీ కారణంగా బీజేపీ మళ్లీ ప్రతిపక్షానికి పరిమితం కావడం ఇష్టం లేని ఆర్ఎస్ఎస్… మోదీనే బీజేపీకి దూరంగా పెట్టాలనే ఆలోచనతో ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి…ప్రణబ్ ను ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ఆహ్వానించడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని ప్రచారం కూడా జరుగుతోంది.ఈ క్రమంలోనే గడ్కరీ, రాజ్ నాథ్ పేర్లను పరిశీలిస్తోందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఆర్ఎస్ఎస్ లోని కొందరు నాయకులు మాత్రం మోదీకి ప్రత్యామ్నాయం వెంకయ్యనాయుడు ఎందుకు కాకూడదనే వాదనను తెరపైకి తెచ్చారని అంటున్నారు…ఈ ప్రశ్నతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయిందట.

తన జీవితాన్ని బీజేపి కోసం అంకితం చేసిన వెంకయ్య ఏనాడు కూడా బీజేపి కి వ్యతిరేకంగా పనిచేయలేదు.

ప్రతిపక్షంలో ఉన్నా సరే అందరికి నోట్లో నాలుకలా వ్యవహరించే వారు వెంకయ్య…హిందూవాది అనే గుర్తింపు ఉన్నా… మరీ అతివాదిగా ముద్ర వేయించుకోని వెంకయ్యనాయుడును మోదీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే విషయంపై ఆర్ఎస్ఎస్ లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది…అయితే వెంకయ్య ప్రధాని అభ్యర్ధి అయితే తప్పకుండా అందరికీ ఏకగ్రీవంగా ఆమోదం అవుతుందని.పార్టీలో ఎవరూ కూడా వెంకయ్యకి వ్యతిరేకంగా మాట్లాడరని ఆరెస్సెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఒకవేళ ఎటువంటి పరిస్థితుల వలన అయినా సరే గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ పేర్లు పక్కకుపోతే…ఆ తరువాత పరిశీలనలో ఉంటుందని ఆర్ఎస్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కాబట్టి అందరి వాడు అయిన వెంకయ్యకే పట్టం కట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు.

అయితే ఎక్కడ తన భవిష్యత్తు కి అడ్డు వస్తాడో అని ముందుగానే మోడీ వెంకయ్య అడ్డు తొలగించుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈ సారి ఆరెస్సెస్ కోరికని మోడీ ఎలా ఎదుర్కుంటాడో అనే టెన్షన్ మాత్రం బీజేపి శ్రేణుల్లో ఉందని అంటున్నారు పలువురు బీజేపి నేతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube