దాదా ఏంటి నీకి బాధ...ఇదే కాంగ్రెస్ మార్క్ రాజకీయం       2018-06-12   04:15:08  IST  Bhanu C

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వేసే ప్రతీ అడుగు బీజేపి కి వ్యతిరేకంగా ఉన్న మరియు అసమ్మతిగా ఉన్న నేతల ఆకర్షణ లో బాగంగా ఉంటుంది..అయితే చాలా కాలం తరువాత కాంగ్రెస్ విందు రాజకీయాలు మొదలు పెట్టింది ఈ క్రమంలోనే రెండేళ్ళ విరామం తరువాత పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఈనెల‌13న‌ ముస్లింల‌కు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోట‌ల్‌లో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి ప‌లు పార్టీల నేత‌ల‌కు ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది…

అయితే గడిచిన రెండేళ్లుగా ఈ విందుకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి పూనుకుంది అందుకుగాను విందుకు ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించి, బీజేపీయేత‌ర ప‌క్షాల ఐక్య‌త‌ను చాటే ప్ర‌య‌త్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టి ఇఫ్తార్ విందు కావడం విశేషం..అయితే కాంగ్రెస్ ఏతర పార్టీలని నాయకులని సైతం పిలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ విందుకు మాజీ రాష్ట్రపతి..కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ప్రణబ్ముఖర్జీ ని పిలవకపోవడం తీవ్ర చర్చకి దారి తీస్తోంది..

మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో నిర్వ‌హించిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ కార్య‌క్ర‌మానికి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ హాజ‌రుకావ‌డంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంత‌`ప్తి వ్య‌క్తం చేసింది అంతేకాదు ఆయన కుమార్తె శ‌ర్మిష్ట కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళవద్దని చెప్పారు అయితే ఎవరి మాట లెక్క చేయని ప్రణబ్ అక్కడికి వెళ్లి చేసిన ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి…దేశ‌వ్యాప్తంగా మోడీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న నేప‌థ్యంలో ఆర్ఎస్ఎస్ నేత‌లు వ్యూహాత్మ‌కంగానే ప్ర‌ణ‌బ్‌ను త‌మ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే బీజేపీ పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించకపోతే ప్ర‌ణ‌బ్‌ను ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ముందుకు తెచ్చే వ్యూహంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఎత్తుగ‌డ వేసింద‌నే వాదన తెరపైకి వచ్చింది…అయితే ఆరెస్సెస్ మద్దతుతో తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎంతో కాలంగా ప్రధాని అవ్వాలనే కోరికని తీర్చుకోవాలని దాదా డిసైడ్ అయ్యారట..కాంగ్రెస్ లో ఉంటె ఇప్పుడు ప్రణబ్ కి ఆ అవకాశం లేదు కాబట్టి దాదా తెలివిగా ఆరెస్సెస్ పంచన చేరి చక్రం తిప్పాలని అనుకుంటున్నాడు..ఏది ఏమైనా దాదా కి కాంగ్రెస్ తీరుతో ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు విశ్లేషకులు..మరి దాదా చివరకి వరకూ ఆరెస్సెస్ తో ఉంటారా లేక మధ్యలో జంప్ అయ్యిపోతారో వేచి చూడాలి.