మోదీ అలసత్వం పై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి ?

పరిస్థితుల ప్రభావమో , అలసత్వమో ! కారణం ఏదైనా కానీ ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.మోదీ దేశ ప్రధానిగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అయ్యారని, వెంటనే ఆయన రాజీనామా చేయాలంటూ ఫేస్ బుక్ లో యాష్ ట్యాగ్ ఉద్యమం మొదలైంది.

 Rss Angry On Prime Minister Narendra Modhi Behaviour, Bjp, Carona Virus, Covid 1-TeluguStop.com

దాదాపు 14 కోట్ల మంది ఈ ఉద్యమానికి మద్దతు పలికారు.అయితే ఆ యాష్ ట్యాగ్ ను ఫేస్ బుక్ తొలగించడంపైన పెద్ద దుమారమే రేగింది.

ఇదిలా ఉంటేేేే జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో సైతం ప్రధాని తీరును తప్పు పడుతుండగా, కేంద్రం మాత్రం ఈ వ్యవహారంలో రాష్ట్రాలపైనే భారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.ఎలా చూసుకున్నా, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై దేశవ్యాప్తంగాా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇక బిజెపి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ సైతం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే ఢిల్లీనే ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గగ సభ్యుడు రాజీవ్ తుల్లి బిజెపి పై తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఢిల్లీ విషయంలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట.కరోనా ప్రభావం కారణంగా ఢిల్లీ సర్వనాశనం అవుతుంటే తగిన సహాయం అందించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఎవరూ ముందుకు రావడం లేదని, ఈ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బిజెపి ఏం చేస్తున్నట్టు అంటూ నిలదీసినట్లు సమాచారం.

  బిజెపి ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ దాన్ని రద్దు చేశారు అంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

కేవలం ఆయన మాత్రమే కాదని ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలు సైతం ప్రధాని తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయమూ వివిధ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సునీల్ అంబేద్కర్ రాజీవ్ వ్యాఖ్యలపై స్పందించినట్లు తెలుస్తోంది.రాజీవ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దీంతో ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు అని చెబుతూ నష్టనివారణ చర్యలకు దిగినా, ఆర్ఎస్ఎస్ నేతలు అందరిలోనూ ఇదే అభిప్రాయం ఉండనే విషయమూ బయటకి వచ్చింది.

కరోనా నేపథ్యంలో ఇంటా బయట మోదీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా అర్థం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube