హుజూరాబాద్ రాజ‌కీయాల్లోకి ఆర్ఎస్ఎస్‌.. ఇక ర‌ణ‌రంగ‌మే!

హుజూరాబాద్‌లో గెలిచేందుకు బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.ఇప్ప‌టికే బ‌ల‌మైన నేత‌గా ఈట‌ల రాజేంద‌ర్ పోటీలో దిగ‌డంతో ఎలాగూ గెలుస్తామ‌నే ధీమా ఉంది.

 Rss Into Huzurabad Politics Now On The Battlefield!, Etala, Bjp, Rss,rss Into Hu-TeluguStop.com

అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకుండా ఇక్క‌డ గెలిచి టీఆర్ ఎస్‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది.ఇక్క‌డ గెలిస్తే పార్టీ బ‌లం అనూహ్యంగ పెరుగుతుంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు.

ఇందుకోసం అన్ని ర‌కాలుగా ముందుకెళ్తున్నారు.ఇప్ప‌టికే మండలానికో ఇన్ చార్జిని నియ‌మించి మ‌రీ ప్ర‌చారం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాలు, రెండు మున్సిపాలిటీల‌ను ఏడు యూనిట్లుగా డివైడ్ చేసుకుని మ‌రీ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ముందుకెళ్తున్నారు.అయినా టీఆర్ ఎస్ నేత‌లంతా హుజూరాబాద్‌లోనే మ‌కాం వేయ‌డంతో త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు ఆర్ ఎస్ఎస్‌ను రంగంలోకి దించారు.

అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో త‌మ ప‌నిని చేసే ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగ‌డం బీజేపీకి అత్యంత ముఖ్య‌మైన అంశం అనే చెప్పాలి.ఎందుకంటే వారు చాలా మ‌ర్యాద పూర్వ‌కంగా ఇంటింటికీ వెళ్లి మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు.

Telugu @bjp4india, Bandi Sanjay, Eetala Rajender, Etala, Huzurabad, Rss Huzuraba

ఇప్ప‌టికే సంఘ్ ప‌రివారం త‌మ కార్యాచ‌ర‌ణ‌న‌ను ప్రారంభించింది.అన్ని మండ‌లాల‌ను అక్క‌డి ప‌రిస్థితులను అంచ‌నా వేస్తూ ప్రణాళిక‌లు రూపొందిస్తోంది.అయితే ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగితే ప్ర‌త్య‌ర్థుల‌కు గట్టి స‌వాల్ ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.ఇప్ప‌టికే ఎన్నో ఎన్నిక‌ల‌ను త‌మ భుజాల మీద వేసుకుని గెలిపించిన చ‌రిత్ర ఆర్ ఎస్ ఎస్‌కు ఉంది.

చేసే ప‌నిని అత్యంత నిబ‌ద్ధ‌త‌తో చేయ‌డ‌మే వీరి ప్ర‌త్యేకత‌.అందుకే ఇప్పుడు వారి అండ‌ను బీజేపీ కోరుకుంటోంది.ఎలాగూ ఈట‌ల రాజేంద‌ర్‌కు పాజిటివ్ వేవ్ ఉండ‌టంతో వీరి ప్ర‌చారం మ‌రింత బ‌లాన్ని పెంచుతుంది.అంటే బీజేపీకి ఎదురు చెప్ప‌డం క‌ష్ట‌మే అన్న‌మాట‌.

దీనిపై టీఆర్ ఎస్ ఎలా ముందుకు వెళ్తుంద‌నేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube