ఏపీ పై మోడీ,షా ల ప్లాన్ బెడిసికొట్టిందిగా..వాట్ నెక్స్ట్       2018-07-02   02:19:54  IST  Bhanu C

ఏపీ అభివృద్దిలో మా సహకారం పూర్తిగా ఉంటుంది అంటూ ప్రగల్భాలు పలికిన మోడీ జీ ఆ తరువాత ఇచ్చిన మాటలు అన్నిటినీ గాలికి వదిలేసి ఎలా వెన్నుపోటు పోడిచారో అందరికీ తెలిసిన విషయమే..అయితే ఆ సమయంలో కూడా మోడీ షా లు ఏపీ పై పట్టు సాధించడం కోసం కొంతమంది నేతలతో ఏపీపై కుట్ర రాజకీయాలు నడిపించారు..కర్ణాటక ఎన్నికల తరువాత ఏపీలో చంద్రబాబు తెలుగుదేశం తుడిచిపెట్టుకుని పోతాయి అంటూ చేసిన వ్యాఖ్యల అనంతరం అక్కడ ఘోరంగా ఓడిపోయిన బీజేపీ ఆ ఎఫెక్ట్ తో ఆ పై కాశ్మీర్ లో కూడా బిజేపీ పాచికలు పారకపోవడంతో తెగ ఇబ్బంది పడ్డారు..దాంతో తమ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి..ఆ పరిణామాలతో ఏపీలో బీజేపి పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది..

ఏపీలో బీజేపీ పేరు ఎత్తితేనే ఒంటికాలిపై లేస్తున్న ప్రజలని చూస్తుంటే భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది దాంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపడుతోంది..అందులో బాగంగానే మోడీ షా లు ఒక వ్యూహాన్ని సిద్దం చేశారు అదేంటంటే..బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయడం ఇందులో ముఖ్యమైంది. కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తోందనీ… ఏపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే నిధులు రాకుండా ఆగిపోయాయని జనానికి తెలిపి ఈ వివరాలని మరియు ఎపీకి చేసిన మేలుని ఆర్ఎస్ఎస్‌ పెద్దలను కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది..

ఈ ఆదేశాలతో ఎంపీ గోకరాజు గంగరాజు అకస్మాత్తుగా నెల్లూరు పయనం అయ్యారు..ఈ క్రమంలోనే నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అతిథిగృహంలో గోకరాజు గంగరాజు సమావేశం ఏర్పాటు చేశారు.అ..జనార్దన్‌రెడ్డి కొడుకు అయిన రాజ్ కుమార్ మొన్నటి వరకూ బీజేపీ లోనే ఉన్నారు అయితే వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్య్టా ఆయన కూడా పార్టీ మారుతాను అని చెప్పడంతో గోకరాజు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు..అయితే ఇదే సమావేశానికి జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు, ఆరెస్సెస్ నాయకులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు.. ఇక సమావేశంలో గోకరాజు బీజేపీ గొప్పదనాన్ని… మోడీ ఏపీకి చేసిన మేళ్ల గురించి పెద్ద ప్రసంగమే చేశారు..

ఆయన స్పీచ్‌ స్టార్ట్‌ చేయగాన సమావేశానికి వచ్చిన ఆరెస్సెస్ నేతలు గోకరాజు పై ఫైర్ అయ్యారట.. ఏపీకి బీజేపీ ఏం చేసిందండీ అంటూ సూటిగానే ప్రశ్నించారు.. నోట్ల రద్దు జీఎస్టీ కారణంగా జనం ఇంకా ఇబ్బందులు పడుతున్నారని.. పైగా పెట్రో ధరలు అమాంతం పెంచేయడంతో ప్రజలు పార్టీని తిట్టిపోస్తున్నారని గంగరాజు దుమ్ము దులిపేశారట…అమరావతికి నిధులు లేవు..కడపలో ఉక్కుకి అడ్డు పడుతున్నారు..పోలవరంపై మోకాలడ్డుతున్నారు..ఇలాంటి చర్యల వలన ఏపీలో బీజేపి తుడచి పెట్టుకు పోతోంది పార్టీ ని ముంచడానికే మీరు కంకణం కట్టుకున్నారా అంటూ బీజేపి నేతలని ఒక ఆట ఆడుకున్నారట దాంతో ఖంగుతిన్న సదరు ఎంపీ గారు ఏమి చేయాలో తెలియక సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది..