RSS ఎఫెక్ట్..చంద్రబాబు పై మోడీ ప్రశంసలు.

గడిచిన కొన్ని నెలలుగా మోడీ.ఏపీ సీఎం చంద్రబాబు ని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టాడో అందరి తెలిసిందే అయితే నీతీ ఆయోగ్ వేదికగా ఒక్క సారిగా మోడీ చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు.

 Rss ఎఫెక్ట్..చంద్రబాబు పై మోడీ ప�-TeluguStop.com

ఎన్నో సార్లు మోడీ ని కలవడం కోసం ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం.బాబు దాదాపు 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు అయినా సరే మోడీ చంద్రబాబు ని కలవలేదు అయితే మొదటి సారిగా నీతి ఆయోగ్ సమావేశం లో కలుసుకోవటం ప్రత్యేక ఆకర్షణ గా నిలచింది.

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే నీతి ఆయోగ్ లో కనీసం మోడీ ని పట్టించుకోకుండా చంద్రబాబు వెళ్ళిపోయారు.అయితే మోడీ తరువాత విరామసమయం లో వచ్చి మరీ చంద్రబాబు ని పలకరించారు.అంతే కాదు తన ప్రసంగంలో సీఎం చందబాబుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.విద్యుత్‌రంగంలో చంద్రబాబు కృషి అభినందనీయమని మోదీ కొనియాడారు…దాంతో నీతిఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…మోడీ కి బాబు కి ఉన్న బ్యాడ్ రిలేషన్ ఎప్పుడూ చూస్తూ వస్తున్న ఇతర రాష్ట్రాల సీఎం లు ఒక్కసారిగా అవ్వక్కాయారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఎంతో హైలెట్ అయ్యారు వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు చాలా మంది సీఎంలు మద్దతు తెలిపారు…చంద్రబాబు ప్రతిపాదనపై సీఎంలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చంద్రబాబు డిమాండ్‌కు సీఎంలు నితీష్‌కుమార్‌, కుమారస్వామి సమర్థించారు.2011.లెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై చంద్రబాబు…అభ్యంతరం తెలిపారు.

బాబు ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారాన్ని చంద్రబాబు బృందం ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది.

ఇదిలాఉంటే లంచ్ బ్రేక్ లో ఈశాన్య రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు ని కలిసారుఅ.చంద్రబాబు తీసుకున్న మార్గాలలో మేము కూడా వెళ్తున్నామని అన్నారు.ఎప్పుడు ఒకరిదగ్గరకియా వెళ్ళని మోడీ ఒక్కసారిగా బాబు దగ్గరకి వెళ్ళడం మీటింగ్ లో ప్రశంసించడం వంటి పరిణామాలకి అందరూ ఆశ్చర్యపోయినా చంద్రబాబు మాత్రం పెద్దగ పట్టించుకోలేదట.అయితే చంద్రబాబు పట్ల ఇంతటి ప్రేమాభిమానాలు చూపించడం వెనుక ఆరెస్సెస్ ఎఫెక్ట్ ఉందని…చంద్రబాబు తో మీకు వైరం ఎదుకు అని మోడీ ని మందలిచడం ప్రధాని అభ్యర్ధికి ప్రత్యామ్నాయం వైపు ఆరెస్సెస్ చూడటం తో మోడీ చంద్రబాబు తో సయోద్యగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube