ఈట‌ల‌కు మ‌ద్ద‌తిస్తున్న ఆర్.ఎస్‌.పీ.. ఎవ‌రికి లాభం..?

తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ పేరు ఇప్పుడు ఎంత‌లా వినిపిస్తుందో అంద‌రికీ తెలిసిందే.కాగా ఆయ‌నకు మొద‌టి నుంచి పార్టీల‌కు అతీతంగా మద్ద‌తు వ‌స్తుంద‌ని అందరికీ తెలిసిందే.

 Rsp Supporting Eta Who Benefits, Rs Praveenkumar, Eetala Rajender,tg Political N-TeluguStop.com

అయితే ఆయ‌న బీజేపీలో చేరిన త‌ర్వాత మాత్రం కొంత గ్యాప్ పెరిగింది ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌కు.అలాగే టీఆర్ఎస్ కూడా ఆయ‌న‌పై పెద్ద ఎత్తున వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్ట‌డంతో ఆయ‌న ఇమేజ్ కూడా కొంత దెబ్బ‌తింటూ వ‌స్తోంది.

ఇంకోవైపు టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్ పెట్ట‌డంతో వారి ఓట్ల‌లో ఈట‌ల‌కు ఎంత ప‌డుతాయో ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ పేరు చెప్ప‌కుండా కేవ‌లం వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను చూసి మాత్ర‌మే ఓటు వేయాల‌ని కోర‌డం కూడా సంచ‌ల‌నం రేపుతోంది.

ఎక్క‌డైనా పార్టీ పేరు లేదంటే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పేరు చెప్ప‌కుండా కేవ‌లం త‌న‌ను చూసి ఓటేయాలనండం కూడా కొంత ఇమేజ్ ను త‌గ్గిస్తోంది.అయితే ఇన్ని చేస్తున్నా కూడా ఆయ‌న‌కు ఇత‌ర పార్టీల నుంచి మ‌రీ ముఖ్యంగా బీసీ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు రావ‌డం కొంత మంచి ప‌రిణామ‌మే అని చెప్పాలి.

అయితే ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో బ‌ల‌మైన మ‌ద్ద‌తు వ‌స్తోంది.

Telugu Dalitha Bandhu, Eetala Rajender, Huzuraabad, Narendra Modi, Rs Praveenkum

బీఎస్పీ కీల‌క నేత అయిన ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ఇప్పుడు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ వ‌స్తున్నారు.

నిన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ను క‌లిసిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ ఈట‌ల రాజేంద‌ర్ ఓడించేందుకు కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నార‌ని, కానీ ఈట‌ల‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంద‌ని ఆయ‌నే గెలుస్తారంటూ కూడా చెప్ప‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

నిజానికి బీఎస్పీకి బీజేపీ పూర్తి వ్య‌తిరేక‌మైన పార్టీ.కానీ ఆయ‌న పార్టీ పేరు చెప్ప‌కుండా కేవ‌లం వ్య‌క్తిగ‌తంగా బీసీ కావ‌డంతో ఈట‌ల‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube