నా జోలికి రావొద్దు ... ! నాయకులకు మాజీ ఐపీఎస్ హెచ్చరికలు 

మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు.ఐదేళ్ల పదవీ కాలం ఇంకా ఉన్నా  ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన వీఆర్ఎస్ తీసుకోవడం ఆసక్తికరంగానే మారింది.

 Rs Praveen Kumar Warning On Hujurabad Leaders-TeluguStop.com

ఆయన ఏదైనా పార్టీలో చేరతారా లేక సొంతంగానే పార్టీ పెట్టబోతున్నారా అనే విషయం క్లారిటీ లేకపోవడంతో మిగతా రాజకీయ పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి.స్వెరో అనే సంస్థ ద్వారా బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్న ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలరని, అన్ని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.

దీంతో ఆయన మద్దతు తమకు ఉన్నట్లుగా చాలా మంది రాజకీయ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.దీనివల్ల దళితుల ఓట్లతో పాటు, స్వెరో టీం సభ్యుల మద్దతు తమకు లభిస్తుందనేది నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.

 Rs Praveen Kumar Warning On Hujurabad Leaders-నా జోలికి రావొద్దు … నాయకులకు మాజీ ఐపీఎస్ హెచ్చరికలు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వ్యవహారం  ప్రవీణ్ కుమార్ వరకు వెళ్లడంతో ఆయన దీనిపై ఘాటుగానే స్పందించారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో కొంతమంది నేతలకు తాను మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదని, ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

తన మద్దతు ఎప్పుడు విద్య వైద్యం ఉపాధి కే ఉంటుందని స్పష్టంచేశారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో వెదజల్లే డబ్బులు వీటి కోసమే ఖర్చు పెట్టాలంటూ నాయకులకు సూచించారు.

Telugu Bjp, Dalit Votes, Elections, Etela Rajender, Hujurabad, Huzurabad Politics, Kcr, Own Political Party, Rs Praveen Kumar, Swero Team, Telangana, Trs, Ts Politics-Telugu Political News

తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని, తనను వివాదాల్లోకి లాగవద్దని, తన జోలికి రావద్దు అంటూ ప్రవీణ్ కుమార్ నాయకులను హెచ్చరించారు.తనను వివాదాల్లోకి లాగితే మీ అంచనాలు తలకిందులు అవుతాయి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్న ప్రవీణ్ కుమార్ సొంత పార్టీ పెట్టబోతున్నారని, దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేయడంతో పాటు తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఇదే కారణంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

#Ts Politics #Dalit Votes #Hujurabad #Swero Team #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు