ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్‌పైనే!

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఇప్పుడు మంచి జోరు మీదున్నాయ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.ఎందుకంటే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అన్ని పార్టీలూ ప‌క్కాగా పావులు క‌దుపుతున్నాయి.

 Rs Praveen Kumar Sensational Comments Indirectly On Kcr,  , Rs Praveen Kumar, Kc-TeluguStop.com

ఇక టీఆర్ ఎస్ అయితే ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్ మీద గెలిచేందుకు నానా తంటాలు ప‌డుతోంది.ఏకంగా ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచేందుకు స్కీములు కూడా పెడుతోంది.

ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉన్న ద‌ళితులు కోసం ఏకంగా ద‌ళిత బంధు స్కీమ్ కూడా పెట్టిందంటే ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే ఈ నేప‌థ్యంలోనే మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్‌.

ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా చేయ‌డం ఎంత పెద్ద సంచ‌ల‌నంగా మారిందో అంద‌రికీ తెలిసిందే.

ఇక ఈయ‌న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకే రాజీనామా చేశార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.అయితే వీట‌న్నింటికీ ఆయ‌న చెక్ పెడుతూ ఏకంగా ఇన్ డైరెక్టుగా టీఆర్ ఎస్ పై, కేసీఆర్‌ఫైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నిన్న జ‌రిగిన స్వేరోస్ మీటింగ్‌లో ఆయ‌న మాట్లాడుతూ బ‌హుజనులు ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

Telugu Dalit Cm, Huzurabad, Kcr, Retired Ips, Rspraveen, Sensational-Telugu Poli

అమ్ముడుపోయి ఓటును అమ్ముకోవ‌ద్ద‌ని తెలిపారు.మ‌ళ్లీ ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని అంటార‌ని, లేదంటే త‌ల న‌రుక్కుంటామ‌ని మాయ మాట‌లు చెబుతార‌ని వాటిని న‌మ్మొద్ద‌ని చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.ఎందుకంటే ఈ మాట‌లు కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీలు.

అంటే ఇన్ డైరెక్టుగా ఆయ‌న కేసీఆర్ మీదే కౌంట‌ర్లు వేసినట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పుడు ఆయ‌న టీఆర్ ఎస్ కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి ప్ర‌వీణ్ కుమార్ కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉంటారా లేదా అన్న‌ది మాత్రం వేచి చూడాల‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube