హుజురాబాద్ ఉప ఎన్నిక పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఎందుకంటే?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఐపీఎస్ ఆఫీసర్ గా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని బీఎస్పీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 Rs Praveen Kumar On Huzurabad By-election ... Because Rs Praveen Kumar, Bsp Par-TeluguStop.com

అయితే ప్రవీణ్ కుమార్ రాజకీయాలోకి వస్తారు అని ఊహించారు.కానీ ఇంత త్వరగా వస్తారని ఊహించలేదు.

మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో రాజకీయాలలోకి రావడం ఒకింత సంచలనంగా మారింది.అయితే ఆ సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

అయితే ఇటీవల ఇతర చిన్న పార్టీలతో సమావేశం కావడంతో ప్రవీణ్ కుమార్ తెర వెనుక భారీ వ్యూహాన్ని రచిస్తున్నాడనే వార్తలు తీవ్ర స్థాయిలో వెలువడ్డ పరిస్థితి ఉంది.అంతేకాక స్వేరో ద్వారా మరిన్ని కార్యక్రమాతో ముందుకొస్తాడని చాలా మంది ఆశించారు.

కానీ ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికపై మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది.

దానికి ప్రధాన కారణం బీఎస్పీ పార్టీకి తెలంగాణలో తగినంత క్యాడర్ లేకపోవడమే.

అంతేకాక ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాజకీయంగా తొందరపడడానికి అవకాశం లేదు.అంతేకాక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా  తన క్యాడర్ ను పెంచుకునే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమయినట్టు తెలుస్తోంది.

అయితే ప్రవీణ్ కుమార్ టార్గెట్ వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా తెలుస్తోంది.ఎందుకంటే అప్పటి రాజకీయ వాతావరణాన్ని ఊహించుకొని అప్పటి పోటీని ఎదుర్కొంటూ ముందుకు సాగాలంటే బీఎస్పీ పార్టీని మరింత బలపడాల్సిన  అవసరం ఖచ్చితంగా ఉంది.

మరి రానున్న రోజుల్లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube