ఆ పార్టీలోకి ప్రవీణ్ కుమార్ ..! ఎల్లుండే ముహూర్తం ?

ఐపీఎస్ అధికారిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తరువాత తెలంగాణ గురుకులాలు కార్యదర్శిగా సమర్థవంతమైన సేవలు అందిస్తూ, అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వ్యవహారం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది.ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

 Rs Praveen Kumar, Bsp, Mayavathi, Bahujana Samajwadi Party, Kcr, Telangana, Nalo-TeluguStop.com

ఇంకా సర్వీస్ ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజీనామా చేశారని, టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటూ పెద్ద ప్రచారమే నడిచింది.

అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకే రాజీనామా చేసినట్టు ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఆ తరువాత స్వయంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ప్రకటనతో అందరికీ క్లారిటీ వచ్చింది.

ప్రవీణ్ కుమార్ బీఎస్పీ లో చేరబోతున్నారు అంటూ మాయావతి స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.అంతకుముందే ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ కు వెళ్లి మాయావతిని కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరబోతున్నట్లు తెలంగాణ శాఖ బీఎస్పీ శాఖ అధ్యక్షడు ప్రభాకర్ ప్రకటన చేశారు.రాజ్యాంగం ను రక్షించేందుకు ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఈ నెల 8వ తేదీన ఆయన చేరబోతున్నారు అంటూ ప్రకటించారు.

 నల్గొండలోని ఎన్.జి కాలేజ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

Telugu Bsptelangana, Hujurabad, Mayavathi, Nalogonda, Swero, Telangana-Telugu Po

బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ చేరబోతున్నట్లు ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు.దీంతో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.స్వేరో అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్న ప్రవీణ్ కుమార్ ఆ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ సంస్థ కు పెద్ద ఎత్తున కార్యవర్గము ఉంది.

వారి సహకారంతోనే రాజకీయంగా తనకు ఇబ్బందులు లేకుండా చేసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రవీణ్ కుమార్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.అయితే తెలంగాణలో చాలా పార్టీలే ఆయనను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినా, ప్రవీణ్ కుమార్ బిఎస్పి ని ఎంచుకోవడం వ్యూహాత్మకమనే చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube