రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా భర్తను..?!

భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం యముడితోనే పోరాడి తన భర్త ప్రాణాలను దక్కించుకున్న మహా ఇల్లాలు గురించి మీరు వినే ఉంటారు.కానీ డబ్బుల కోసం బ్రతికుండగానే తన భర్తను అగ్నికి ఆహుతి చేసిన భార్య గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా ?! తన భర్త మూడు కోట్ల రూపాయిల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య ఎవ్వరూ ఊహించని పని చేసింది.తన భర్తను చంపేస్తే రూ.3 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుందని, ఆ డబ్బులతో ఎంజాయ్ చెయ్యోచ్చని ప్లాన్ వేసిన ఆంటీ బంధువుతో కలిసి భర్తను కారులో పెట్టి బ్రతుకుండగానే పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది.అసలు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే తమిళనాడు లోని ఈరోడ్ జిల్లా పెరండురైకి చెందిన రంగరాజన్ (62) అనే ఆయన పవర్ లూమ్స్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడంతో తెలిసిన వాళ్ల దగ్గర కోటి రూపాయల వరకు అప్పు చేశాడు.

 Rs Husband Together For 3 Crore Insurance Money-TeluguStop.com

కానీ మళ్ళీ వ్యాపారం డీలా పడడంతో రంగరాజన్ అయోమయంలో పడిపోయాడు.

అయితే రంగరాజన్ బాగా డబ్బులు సంపాధించే సమయంలో రూ.3 కోట్లకు ఇన్సూరెన్స్ చేశాడు.నామినిగా అతని భార్య అయిన జ్యోతిమణి (54) పేరు పెట్టాడు.

 Rs Husband Together For 3 Crore Insurance Money-రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా భర్తను..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రంగరాజన్ కి అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని రంగరాజన్ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.ఇవన్నీ చుసిన భార్య జ్యోతిమణి భర్తను సూటిపోటిమాటలతో వేధింపులకు గురి చేసింది.

ఇది ఇలా ఉండగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో రంగరాజన్ కాలు విరిగింది.కోయంబత్తూరు లోని ఓ ఆసుపత్రిలో రంగరాజన్ ను చేర్పించి చికిత్స చేయించారు.అయితే ఇక్కడే భార్య జ్యోతిమణికి ఒక ఆలోచన వచ్చింది.తన భర్త చేసిన అప్పులు పూర్తిగా తీరిపోవాలంటే రంగరాజన్ ను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి వాటితో అప్పులు తీర్చేసి మిగిలిన రూ.2 కోట్లతో మనం జల్సా చెయ్యడానికి అవకాశం ఉంటుందని ఆంటీ జ్యోతిమణి అతని సమీప బంధువు రాజా (41) అనే వ్యక్తికి చెప్పింది.అనుకున్నదే తడవుగా రాజాతో కలిసి జ్యోతిమణి భర్త హత్యకు స్కెచ్ వేసింది.

ఈ క్రమంలో శుక్రవారం జ్యోతిమణి ఆంటీ, ఆమె బంధువు రాజా కోయంబత్తూరు లోని ఆసుపత్రికి వెళ్లి భర్త రంగరాజన్ ను డిశ్చార్జి చెయ్యాలని డాక్టర్లకు చెప్పారు.తరువాత ఓమిని కారులో రంగరాజన్ ను పిలుచుకుని సొంత ఊరికి బయలుదేరారు.

కోయంబత్తూరు సమీపంలోని పెరుమనల్లూరు సమీపంలో కారులో పొగలు వస్తున్నాయన మీరు కారులోనే కూర్చువాలని, మేము వెళ్లి చూసి వస్తామని రంగరాజన్ కు చెప్పి కారులో నుంచి బయటకు వచ్చారు.అలా రంగరాజన్ ఉన్న కారు మీద పెట్రోల్ పోసి భార్య జ్యోతిమణి, రాజా కలిసి కారుకు నిప్పంటించి అతన్ని సజీవదహనం చేశారు.

ఇంకేముంది ఇద్దరు డ్రామా మొదలుపెట్టారు.కారు ప్రమాదంలో తన భర్త రంగరాజన్ సజీవదహనం అయ్యాడని జ్యోతిమణి పోలీసులకు చెప్పింది.ఇదే సమయంలో జ్యోతిమణి ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.ప్రమాదం జరిగిన చోటుకు పోలీసులు రాగ మొదట జ్యోతిమణి మాటలు నమ్మారు.ఇదే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు వచ్చి ఇది రూపాయి రెండు రూపాయిల విషయం కాదని రూ.3 కోట్ల వ్యవహారం అని, మాకు మీ ఎఫ్ఐఆర్ చాలా కీలకం అని పోలీసులకు చెప్పారు.దీనితో పోలీసుల విచారణలో జ్యోతిమణి ఆంటీ, ఆమె బంధువు రాజా గంటకు ఒకమాట మాట్లాడటంతో పోలీసులకు అనేక అనుమానాలు వచ్చి ఇంట్రాగేషన్ చేయగా అసలు నిజం బయటపడింది.

#Accident. Viral #3crores #Insurance Money #Wife #Husband

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు