రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డ్..!

అదృష్టదేవత ఎవరిని ఎప్పుడు ఎలా కనుక వరిస్తుందో చెప్పలేము.కానీ అదృష్టదేవత ఒక్కసారి తలుపుతట్టింది అంటే చాలు ఎంతటి కటిక పేదవాడైనా సరే రాత్రికి రాత్రే అమాంతం కోటీశ్వరుడు అయిపోయిన సంగతులు ఎన్నో చూసాము.

 Rs Billionaire Security Guard With 100 Lottery-TeluguStop.com

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఓ నిరుపేద సెక్యూరిటీ గార్డు విషయంలో జరిగింది.అతడి కేవలం వంద రూపాయలు పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్ని మార్చేసింది.

దాంతో అతడికి ఉన్న కష్టాలు అన్ని దూరం అయిపోయి కోటీశ్వరుడు అయిపోయాడు.ఈ సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు పట్టణంలో జరిగింది.

 Rs Billionaire Security Guard With 100 Lottery-రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంగుళూరులోని భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మొహిద్దిన్ స్వస్థలం కేరళ.అతడు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు వలస వచ్చేశాడు.అలా వచ్చిన అతను మంగుళూరులోని ఓ భవంతిలో సెక్యూరిటీ గార్డ్ గా సేవలు అందిస్తున్నాడు.అయితే వారానికి ఐదుగురికి ఒక కోటి రూపాయల చొప్పున బహుమతి అందించే కేరళ భాగ్యలక్ష్మి లాటరీ తాజాగా అతనికి వరించింది.

దాంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.ఉపాధి పని కోసం కొన్ని సంవత్సరాల క్రిందట అతడు కుటుంబంతో కలిసి కేరళ నుండి కర్ణాటకకు బతుకు దెరువు కోసం వచ్చేశాడు.అయితే అతనికి అప్పుడప్పుడు లాటరీ కొనే అలవాటు ఉండటంతో అతడు తాజాగా ఏప్రిల్ 4న రూ.100 వెచ్చించి కేరళ లాటరీ కొనుగోలు చేశాడు.ఎప్పటిలాగానే వారానికి ఐదు మంది చొప్పున ప్రకటించిన అదృష్టవంతుల వివరాలలో మొహిద్దిన్ కొన్న లాటరి నెంబర్ కూడా ఉండడంతో అతడు ఆనందంతో గెంతులేసాడు.

అతనికి కోటి రూపాయల ప్రైస్ మనీ వచ్చిందన్న విషయం తెలియగానే అతడు ఆనందంగా ఫీల్ అవడంతో తన కష్టాలన్నీ తీరిపోయినట్లేనని తెలిపాడు.

ప్రస్తుతానికి అరకొర జీతంతో కుటుంబాన్ని పోషించడం చాలా భారంగా ఉందన్న సమయంలో ఇలా అనుకోని విధంగా కోటి రూపాయల లాటరీ తగలడంతో తాను నమ్మలేకపోతున్నట్లు తెలియజేశాడు.అయితే అతనికి తగిన లాటరీ డబ్బులు చేతికి రాగానే తనతో పాటు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సొంత రాష్ట్రానికి వెళ్లిపోతానని అక్కడే తన శేష జీవితం గడుపుతానని మొహిద్దిన్ తెలిపాడు.

#Security Guard #Lottery #Mangalore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు