రూ. 75,000 హోండా బైక్‌ ఇపుడు రూ. 20,000లకే పొందండిలా!

రూ.75,000 హోండా బైక్‌ రూ.20,000లకే ఎవరిస్తారు? అని ఆశ్చర్య పోవద్దు.ఇది నిజమే, అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.అవును, ఇపుడు మీరు హోండా బైక్‌ను కొనాలని యోచిస్తే కేవలం రూ.20 వేల రూపాయిలు చెల్లించి మీ ఇంటికి తెచ్చుకోండి.తక్కువ బడ్జెట్‌లో Honda CB Shineను సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ తాజాగా అందుబాటులో ఉంచింది.సాధారణంగా ఈ మోడల్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ.72,787 నుంచి రూ.77,582 మధ్య ఉండటం గమనార్హం.

 Rs. 75,000 Honda Bike Now Rs. Get It For 20,000! Honda Cb Shine, Honda Bikes, H-TeluguStop.com

Telugu Honda, Honda Cb Shine, Website, Hand-Latest News - Telugu

ఇక వివరాల్లోకి వెళితే, సదరు Honda CB Shineను ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయినటువంటి ‘Bikes 24’ అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం విశేషం.ఈ 2019 మోడల్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 65 కిలోమీటర్లు వరకు వస్తుందని భోగట్టా.అలాగే 10.5 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ దీనికి కలదు.అలాగే దీనిది ఎయిర్ కూలెడ్, 4 స్ట్రోక్, బీఎస్-6 ఇంజిన్.ఈ వాహనానికి డిస్క్, డ్రమ్ బ్రేక్స్ అమర్చబడి వున్నాయి.ఈ బైక్ కేవలం రూ.20 వేలకే అమ్మకానికి అందుబాటులో ఉంచారు.

Telugu Honda, Honda Cb Shine, Website, Hand-Latest News - Telugu

ఇకపోతే ఇక్కడ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీల వరకు వెళ్ళకూడదు.అదంతా పక్కనబెడితే కరోనా తరువాత మోటార్ ఇండస్ట్రీ భారీగా వాహన ధరలను పెంచేసింది.ఒకప్పుడు 60000కి లభ్యమయ్యే వాహనాలు ఇపుడు లక్షకు పైనే ధరలు పలుకుతున్నాయి.ఇటువంటి తరుణంలో చాలా మంది సెకండ్ హ్యాండ్ వాహనాలవైపు తమ దృష్టిని మళ్లించారు.అలాంటివారికి పైన పేర్కొనబడిన సో కాల్డ్ వెబ్ సైట్స్ సహకరిస్తున్నాయి అనడంలో సందేహమే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube