విద్యార్థుల అకౌంట్ లో రూ. 7 లక్షలు.. ఎంతవరకు నిజం..?!

ప్రస్తుత కాలంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ వార్త నిజమో.

 Money, Students, Bank Account, 7 Lakhs, Governament, Fact Check, Jeevan Suraksha-TeluguStop.com

ఏది అబద్ధమో తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇందులో భాగంగానే కొందరు కొన్ని వార్తలను నమ్మి బొక్కబోర్లా పడుతుంటారు.

కొంతమంది వాటిని నమ్మకుండా అది ఎంతవరకు నిజమో అని తెలుసుకొని ముందుకు వెళ్తూ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు.ఈ మధ్యకాలంలో నిజమైన వార్తల కంటే ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఫేక్ వార్త ఒకటి బాగా ప్రచారంలోకి వస్తోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జీవన్ సురక్ష యోజన అని ఓ సరికొత్తపథకాన్ని మొదలు పెట్టిందని ఇందుకోసం దేశంలోని విద్యార్థులు బ్యాంకు ఖాతాలో ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయలు జమ అవుతాయని ఎంతోమంది సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేశారు.అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఏడు లక్షలు వస్తాయి అంటూ పలు యూట్యూబ్ చానల్స్ కూడా పలు వీడియోలను చిత్రీకరించి వైరల్ గా చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అదంతా బూటకమే అని నిర్ధారణ అయింది.

ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని తెలిపింది.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని అసలు ప్రారంభించలేదని నిర్ధారణ చేసింది.దీంతో జీవన్ లక్ష్య యోజన అనే కార్యక్రమం లేదని నిర్ధారణ అయిపోయింది.

అంతేకాదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇలాంటి ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube