ఎన్నికల నేపథ్యంలో ఈసీ( Election Commission ) ఇప్పటివరకు రూ.4,650 కోట్లను రికవరీ చేసింది.నగదు, మద్యం, డ్రగ్స్ మరియు బహుమతుల రూపంలో ఎన్నికల కమీషన్ రికవరీ చేసింది.
దేశ వ్యాప్తంగా రూ.395.39 కోట్ల నగదును ఈసీ రికవరీ చేసినట్లు తెలుస్తోంది.బంగారం, విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు, రూ.489.31 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.అలాగే డ్రగ్స్ రూపంలో అత్యధికంగా రూ.2,068.85 కోట్లు, బహుమతుల రూపంలో రూ.1,142.49 కోట్లను రివకరీ చేసింది.కాగా దేశ చరిత్రలో అత్యధిక మొత్తంలో రికవరీ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.