రాజమౌళి RRR మరో 2000 కోట్ల తెలుగు సినిమానా ? అలా అనడానికి ఇదిగో కారణాలు  

రాజమౌళి Rrr మరో 2000 కోట్ల తెలుగు సినిమానా ? అలా అనడానికి ఇదిగో కారణాలు-ntr,rajamouli,ram Charan,rrr Movie,rrr Movie Budget,rs 2000 Crores Budget

బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగింది ఎంత అంటే మన దేశం లో సినిమాల్ని శాసించే ఇండస్ట్రీ బాలీవుడ్ కూడా తెలుగు సినిమా వైపు చూసింది , దీనికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభ తో దేశ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తరువాత వచ్చిన దాదాపు పెద్ద హీరోల హిట్ సినిమాలన్నింటికి 100 కోట్లకు పైనే కలెక్షన్లు వచ్చాయి . అయితే రెండేళ్ల విరామం తీసుకొని రామ్ చరణ్ , jr. ఎన్టీఆర్ కథనాయకులుగా చేస్తున్న రాజమౌళి సినిమా RRR ..

రాజమౌళి RRR మరో 2000 కోట్ల తెలుగు సినిమానా ? అలా అనడానికి ఇదిగో కారణాలు -Rs 2000 Crores Budget For #RRR Movie

ఈ సినిమా కొమరం భీం , అల్లూరి సీతారామరాజు గారి తెలియని ఊహాజనిత కోణం లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

RRR సినిమాని 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీలలో రిలీజ్ కాబోతుంది. 4 సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి పార్ట్ 1 సినిమానే అప్పటి మార్కెట్ కి 500 కోట్ల పైగా వసూలు చేసింది. పైగా RRR లో బాలీవుడ్ నటులు అయిన అజయ్ దేవ్ గన్ , అలియా బట్ నటించడం ఈ సినిమాకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ ఏర్పడింది.

తెలుగు సినిమాలు హిందీ లో డబ్ అయి రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

RRR మరో 2000 కోట్ల రాజమౌళి సినిమా అవబోతుందా?

2017 లో విడుదలైన బాహుబలి పార్ట్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారతదేశం లోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో దంగాళ్ తరువాత స్థానం లో ఉంది. 2020 జూలై లో రాబోతున్న # RRR చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వబోతుంది . పైగా రాజమౌళి సినిమా గురించి ప్రెస్ మీట్ లొనే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పి సినిమా పైన అంచనాలని ఇంకా పెంచేశారు. పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ , రాజమౌళి దర్శకత్వం లో రావడం , బాలీవుడ్ తో పాటు తమిళ్ నటులు ఉండటం , రామ్ చరణ్ ,తారక్ మల్టి స్టార్ సినిమా కావడం ఈ సినిమాకి 2000 కోట్ల కలెక్షన్ లు రావడం చాలా సులభం అంటున్నారు తెలుగు సినీ అభిమానులు. దాని కోసం మరి ఏడాది పాటు ఆగాల్సిందే.