ప్రాణం తీసిన రూ.2 వేలు.. ఎవరూ నమ్మడంలేదని యువకుడి సూసైడ్..

Rs 2 Thousand Killed Suicide Of A Young Man That No One Can Believe

డబ్బు మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా తీసుకొస్తుంది.దీని కోసం కొందరు మంచి చెడులను మరిచిపోతారు.

 Rs 2 Thousand Killed Suicide Of A Young Man That No One Can Believe-TeluguStop.com

మరికొందరు బంధుత్వాలను మరిచిపోతే.ఇంకొందరు తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను సైతం లెక్క చేయరు.

ప్రపంచంలో చాలా మంది చావులకు కారణం ఈ డబ్బే.అత్యవసరంగా రూ.2 వేలు అవసరమున్న వ్యక్తి తనకు తెలిసిన వారందరినీ సాయం చేయమని అడిగాడు.అందుకు అందరూ వెనకడుగు వేశారు.

 Rs 2 Thousand Killed Suicide Of A Young Man That No One Can Believe-ప్రాణం తీసిన రూ.2 వేలు.. ఎవరూ నమ్మడంలేదని యువకుడి సూసైడ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో చివరకు అతడు తన ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటన మేడ్చల్ జిల్లా పొలన్నాల్ గ్రామంలో జరిగింది.

మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట మండలం, పొన్నాల్‌ గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్‌(23) అనే వ్యక్తి తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి ఊర్లు తిరుగుతూ అడిగిన వారికి అప్పులు ఇస్తుండేవాడు.ఇతని వద్ద మూడు నెలల క్రితం ఆనంద్ రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు.ఆనంద్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి మరికొందరితో కలిసి ఈనెల 22న అతని ఇంటికి వచ్చాడు.అయితే ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేవని ఆనంద్ బదులిచ్చాడు.

తొందరలోనే ఇచ్చేస్తానని చెప్పాడు.కానీ అప్పు ఇచ్చిన వ్యక్తి వినలేదు.కనీసం రూ.2 వేలు ఇవ్వాలని.కొత్త నోట్ రాసుకుందామని అక్కడే ఉండిపోయారు.దీంతో తెలిసిన వారందరినీ ఆనంద్ డబ్బులు అడిగినా ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చివరకు బాగా తెలిసిన వ్యక్తి వద్ద శనివారం రూ.వెయ్యి తీసుకుని.అప్పు ఇచ్చిన వారి తిండికి ఖర్చుపెట్టాడు.దీంతో వారు కొత్త నోట్ రాసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.కేవలం 2వేల రూపాయల కోసం అతన్ని ఎవ్వరూ నమ్మడంలేదని మనస్తాపానికి గురైన ఆనంద్.ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

#Maryala Anand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube