బెంగళూరు ప్రధాన కేంద్రంగా, హైదరాబాద్ లో రూ.1500 కోట్ల స్కామ్ గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ?

రోజు రోజుకు మోసగాళ్లకు హైదరాబాద్ నగరం అడ్దాగా మారుతుంది.అందుకు వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు ఉదహరణగా చెప్పవచ్చూ.ఇకపోతే బెంగళూరు ప్రధాన కేంద్రంగా, హైదరాబాద్ లో రూ.1500 కోట్ల స్కామ్ గుట్టు రట్టు చేసారు పోలీసులు.తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అమాయకులను నిలువునా ముంచేసారు.ఆ వివరాలు తెలుసుకుంటే.

 Rs 1500 Crore Scam In Hyderabad Statement By Cp-TeluguStop.com

బెంగళూరుకు చెందిన అభిలాష్ థామస్, ప్రేమ్ కుమార్ సహా మరికొంత మంది ఓ ముఠాగా ఏర్పడి, ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ అనే పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు.ఆ తర్వాత ఈ మాయ కంపెనీని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు.ఇందులో భాగంగా రూ.12,500 రూపాయలతో ఈ కంపెనీలో సభ్యత్వం తీసుకుంటే, అంతే విలువగల వివిధ ప్రొడక్టులను అందిస్తుంటారు.అదీగాక ఈ సభ్యత్వం తీసుకున్న వారు ఇతరులను కూడా చేర్చుకుంటూ పోతే వారికి గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అంటూ కేటగిరీలను క్రియేట్ చేసి మాయ చేస్తారు.ఎంత మందిని చేర్చితే వారికి అంత లాభం అంటూ మోసపుచ్చుతారు.

ఇలా మొత్తం మీద 1500 కోట్ల రూపాయలను అమాయకుల నుంచి వసూలు చేసినట్లుగా సమాచారం.ఇకపోతే గత పది రోజుల క్రితం గచ్చీబౌలీ పోలీసులకు, ఇండస్ వివా సంస్థపై ఫిర్యాదు అందిందట.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.కానీ సంస్థ చైర్మన్ మాత్రం పరారీలో ఉన్నట్టు సమాచారం.

చూశారా లోకంలో జరుగుతున్న మోసాలు.దీనికంతటికి కారణం అత్యాశ, డబ్బు మీద ఉన్న వ్యామోహం.

వీటికి లొంగితే ఇలాగే మోసపోతారు జాగ్రత్త.

#Scam #Hyderabad #Rs 1 500 Crore #CP Sajjanar #Bangalore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు