RRR అప్డేట్ : తమ పని పూర్తి చేసిన ఎన్టీఆర్, చరణ్!

టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 Rrr Update Ntr Charan Complete Their Shooting-TeluguStop.com

అయితే ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యం అయ్యింది.అసలు దసరా సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.

అయితే ఎట్టకేలకు రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడి పోయింది.

ఇక ఈ సినిమా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఈ ఇద్దరు స్టార్స్ మిగతా పనులు కూడా పూర్తి చేసినట్టు సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

Telugu Rrr, Rajamouli, Ram Charan, Fix, Rrrntr, Sankranti-Movie

మలయాళం వెర్షన్ కోసం కొన్ని చిన్న రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు మినహా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యే దశలో ఉన్నట్టు సమాచారం.రిలీజ్ దగ్గర పడడంతో రాజమౌళి చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

Telugu Rrr, Rajamouli, Ram Charan, Fix, Rrrntr, Sankranti-Movie

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.ఇలా చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుంటే.

ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.ఇక ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా అభిమానులు ఎంతగా మెప్పిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube