జులైలో ఆర్ఆర్ఆర్ ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్తున్న జక్కన్న

తారక్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని జక్కన్న చాలా వేగంగా పూర్తి చేయాలని ముందుగా టార్గెట్ పెట్టుకున్నారు.

 Rrr To Resume Shoot From July 1st-TeluguStop.com

బాహుబలి తరహాలో నాలుగేళ్ల సమయం తీసుకోకుండా ఏడాదిలో కంప్లీట్ చేసి రిలీజ్ కూడా చేయాలని భావించారు.అందుకు తగ్గట్లుగానే క్యాస్టింగ్ సెలక్షన్ వేగంగా పూర్తి చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు.

అయితే ఉన్నపళంగా గత ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా ఎఫెక్ట్ మొదలైంది.దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

 Rrr To Resume Shoot From July 1st-జులైలో ఆర్ఆర్ఆర్ ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్తున్న జక్కన్న-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్ళీ డిసెంబర్ తర్వతా లాక్ డౌన్ నుంచి సడలింపులు లభించగానే షూటింగ్ స్టార్ట్ చేశారు.మళ్ళీ ఈ ఏడాది మర్చి నుంచి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.

దీంతో మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది.అయినప్పటికీ 90 శాతం టాకీ పార్ట్ ని జక్కన్న కంప్లీట్ చేసేశాడు.

Telugu Ajay Devagan, Jr Ntr, July 1st, Rajamouli, Ram Charan, Rrr, Tollywood-Movie

ఇదిలా ఉంటే మళ్ళీ లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్ లకి పర్మిషన్ దొరకనుంది.దీంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.వీలైనంత వేగంగా సెట్స్ పైకి వెళ్లాలని భావించి ఇప్పటికే నటీనటులు అందరికి ఇన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తుంది.జులై మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు టాక్.

ఇక షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకొని టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారు.మళ్ళీ వెంటనే సాంగ్స్ చిత్రీకరణ కూడా మొదలు పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

వీలైనంత వేగంగా షూటింగ్ కి ముగింపు చెప్పేసి కనీసం అక్టోబర్ నాటికి సిద్ధం చేసేయాలని భావిస్తున్నారు.సెట్ కాకుండా సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

#Ajay Devagan #Rajamouli #Ram Charan #Jr NTR #July 1st

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు