రాజమౌళి కొత్త బిస్కెట్.. ఇక దసరాకే దిక్కు!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు ఎదురుచూస్తున్నారు.

 Rrr To Release In October During Dussehra-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వచ్చినా వదలకుండా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు.

ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని వారు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు.అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో చిత్ర యూనిట్ నుండి ఎలాంటి న్యూస్ రాకపోయినా, సినిమా రిలీజ్‌పై మాత్రం తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ముందుగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో జూలై 30న రిలీజ్ చేస్తామని గొప్పలు చేప్పిన రాజమౌళి, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.అక్టోబర్ నెలలో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు జక్కన్న ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకుల ఆశలపై మళ్లీ నీళ్లు పోశాడు రాజమౌళి అంటూ ఉసూరుమంటున్నారు తారక్ మరియు చరణ్ ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube