ఆర్ఆర్ఆర్‌కు మరో రెండేళ్లు తప్పదా..?

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టి్స్తుందా అని అందరూ చూస్తున్నారు.

 Rrr To Get Delayed For Two More Years, Rrr, Ntr, Rajamouli, Ram Charan, Tollywoo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హీరోల టీజర్లు ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేశాయి.

గతేడాది జూలైలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు 2021 అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించారు.ఏదేమైనా ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసి తీరాలని జక్కన్న అండ్ టీమ్ పట్టుదలతో ఉన్నారు.

కానీ వారి ఆశలపై కరోనా సెకండ్ వేవ్ నీళ్లు చల్లిందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా మిగిలి ఉండటం, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి థియేటర్ అక్యుపెన్సీ సగమే ఉంటే అది ఆర్ఆర్ఆర్‌కు ఏమాత్రం కలిసి రాదు.దీంతో థియేటర్లలో జనం వంద శాతం అక్యుపెన్సీ ఉన్నప్పుడే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందో, థియేటర్లలకు జనం నిండుగా ఎప్పుడు వస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి.దీంతో ఈ సినిమా 2022లో కూడా రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసేందుకు మరో రెండేళ్ల పాటు ఆగాల్సిందేనా అని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube