అక్కడ కూడా ముగించేస్తున్న ఆర్ఆర్ఆర్.. ఇక లాస్ట్‌దే బ్యాలెన్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rrr To Finish Mahabaleshwar Schedule, Rrr, Ntr, Ramcharan, Rajamoli, Mahabaleshw-TeluguStop.com

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను కరోనా గ్యాప్ తరువాత తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం మహాబలేశ్వర్ ప్రాంతంలోని అందమైన లొకేషన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతిని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలియజేశారు.ఈ షూటింగ్‌లో తారక్, చరణ్‌లకు సంబంధించి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ షెడ్యూల్ ఒక వారం రోజులు మాత్రమే ఉంటుందని, ఇది పూర్తి చేసుకుని చివరి షెడ్యూల్‌ను డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఈ చివరి షెడ్యూల్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక తారక్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.తారక్ సరసన ఒలివియా మారిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube