ఆర్ఆర్ఆర్ హీరోలను ఢీకొడతానంటోన్న పుష్ప- Rrr To Clash With Pushpa

RRR To Clash With Pushpa, RRR, Pushpa, Allu Arjun, Ram Charan, NTR - Telugu Allu Arjun, Ntr, Pushpa, Ram Charan, Rrr

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Rrr To Clash With Pushpa-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండుగా, ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

దీంతో ఆర్ఆర్ఆర్ కోసం అప్పుడే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

 Rrr To Clash With Pushpa-ఆర్ఆర్ఆర్ హీరోలను ఢీకొడతానంటోన్న పుష్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరో భారీ చిత్రం అదే సమయంలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ సినిమాను కూడా దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

దీంతో దసరాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనబోతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ పూర్తిగా రివెంజ్ డ్రామా చిత్రంగా రానుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అటు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పీరియాడికల్ మూవీగా జక్కన్న తెరకెక్కిస్తుండగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల మధ్య సాగే వార్‌లో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

#Pushpa #Allu Arjun #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు