దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో తారక్ సరసన నటిస్తోన్న హీరోయిన్, విలన్ల పేరును ఈ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
కాగా ఈ సినిమాను భారతదేశ వ్యాప్తంగా ఏకంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలే గాక హిందీ భాషతో పాటు మరో 5 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాను ఏయే భాషల్లో రిలీజ్ చేస్తారనే విషయంలో మాత్రం చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.
ఏదేమైనా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదో సంతోషకరమైన వార్త అని, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక తారక్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్నాడు.మరి ఈ సినిమా భారత్ సినిమా రంగంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.