ఆర్ఆర్ఆర్‌కు వణుకు పుట్టిస్తున్న బ్యూటీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

 Rrr Team Worried With Alia Bhatt, Rrr, Alia Bhatt, Rajamouli, Sadak2, Ntr, Ram C-TeluguStop.com

కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు చూస్తున్నాయి.

అయితే ఈ సినిమాను ఇప్పుడు ఓ అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఆలియా భట్ ఈ సినిమాలో నటిస్తుండటమే ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు వణుకు పుట్టిస్తోంది.

ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో, బాలీవుడ్‌లో ఎలాంటి పరిణామం వెలుగుచూస్తుందో మనకు తెలిసిందే.ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజం అనే పదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారగా, దానికి కేరాఫ్‌గా మారింది ఆలియా భట్.దీంతో ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సడక్-2’ చిత్ర ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో 2మిలియన్‌లకు పైగా డిస్‌లైక్స్ వచ్చాయి.

ఓ సినిమా టీజర్‌కు ఇంత నెగెటివిటీ రావడం ఇదే ప్రథమం.

దీంతో ఆలియా భట్ పేరు వింటేనే బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు.అలాంటిది ఆమెను తమ సినిమాలో తీసుకోవడంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారా అనే సందేహం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌లో నెలకొంది.

ఇదే విషయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.మరి ఆలియా భట్ విషయంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube