దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫ్యాన్స్ సంబర పడ్డారు.
కానీ ఈ సినిమా మళ్ళీ వాయిదా పడడంతో నిరాశ వ్యక్తం చేసారు అభిమానులు.
అయితే ఎట్టకేలకు మళ్ళీ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్ళీ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు.
ఈసారి కరోనా కూడా తగ్గడంతో రావడం పక్కా అంటున్నారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు.
ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా మరొక అప్డేట్ ను వదిలింది.మేకర్స్ ఈ సినిమా ఆన్ లొకేషన్ కి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో షేర్ చేస్తూ.
ఈ స్టిల్ సినిమాలోని కీలక ఘట్టం లో హీరోలు రామ్ చరణ్ గుర్రం పై ఎన్టీఆర్ మోటార్ సైకిల్ పై కదనోత్సాహంతో కదులుతున్న సందర్భానికి సంబంధించిన ఫోటో అని షేర్ చేయడంతో ఇది బాగా ఆకట్టుకుంటుంది.

ఈ ఫొటోలో మరొక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చేసారు.మరో 50 రోజుల్లో సినిమా థియేటర్ లో రేసింగ్ ప్రారంభం కాబోతుంది.ఆర్ ఆర్ ఆర్ మూవీపై జల ప్రవాహం అంటూ ట్వీట్ చేసారు.
అంతే కాకుండా మార్చి 25న మిమ్మల్ని మేము చూస్తాం” అంటూ ఈ ఫోటోను షేర్ చేసారు.ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.