ఆర్ఆర్ఆర్ నుంచి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చిన రాజమౌళి

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ హీరోలుగా, అల్లూరి సీతారామరాజు, కొమరామ్ భీం మాత్రలతో కనిపించబోతున్నారు.

 Rrr Team Release New Poster Unite Hands, Tollywood, Bollywood, Rrr Movie, Jr Ntr-TeluguStop.com

అలాగే ఇందులో అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా, అలియా భట్, హాలీవుడ్ నటి హీరోయిన్స్ గా చేస్తున్నారు.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి మరల రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం జక్కన్న రామోజీ ఫిలిం సిటీలో జూనియర్ ఎన్ఠీఆర్ కి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.దసరాకి ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్ఠీఆర్ పాత్రకి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీనికోసం ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకి సంబందించిన టీజర్ తో సినిమా మీద హైప్ పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా ఉన్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.వెనుక అశోక ధర్మచక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్ ఉంది.

ఈ పోస్టర్ లుక్ పాతకాలంలో ప్రభుత్వం కొంత మంది వ్యక్తుల జ్ఞాపకార్ధం రిలీజ్ చేసే నాణెం తరహాలో డిజైన్ చేసి విడుదల చేశారు.ఈ పోస్టర్ లుక్ బట్టి భారత స్వాతంత్య్రం కోసం అల్లూరి, భీమ్ కలిసి తెల్లవారిపై ఎలా పోరాటం చేశారు అనే విషయాన్ని చూపించబోతున్నారు అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube