RRR : చివరి పాట కోసం ఫారిన్ చెక్కేసిన రాజమౌళి టీమ్!

ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 Rrr Team Flies East Europe For Final Song-TeluguStop.com

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Rrr Team Flies East Europe For Final Song-RRR : చివరి పాట కోసం ఫారిన్ చెక్కేసిన రాజమౌళి టీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయి ఈ మధ్యనే పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ఒక పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేసారు.

ఈ సినిమా ముందు నుండి అనుకున్నట్టుగానే అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.మొన్నటి వరకు ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో అని అందరు అనుకున్నారు.

Telugu Dosti Song, Europe, Final Song, Ntr, October 13, Rajamouli, Ram Charan, Rrr, Rrr Team Flies East Europe For Final Song-Movie

కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వాయిదా పడే అవకాశమే లేదని రాజమౌళి స్పష్టం చేసారు.అయితే ఇప్పుడు మిగిలి ఉన్న ఆ ఒక్క పాట కోసం టీమ్ మొత్తం ఫారిన్ వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ రోజు ఉదయం తన టీమ్ తో కలిసి యూరప్ వెళ్లినట్టు సమాచారం.ఈ సాంగ్ ను అందమైన లొకేషన్లలో విజువల్ వండర్ గా తీయబోతున్నాడని తెలుస్తుంది.

ఆగస్టు మూడో వరం కల్లా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చి మిగతా వర్క్ పూర్తి చేయబోతున్నారు టీమ్.

Telugu Dosti Song, Europe, Final Song, Ntr, October 13, Rajamouli, Ram Charan, Rrr, Rrr Team Flies East Europe For Final Song-Movie

ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.నిన్ననే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుండి విడుదల అయిన దోస్తీ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో టీమ్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

#RRRTeam #Dosti #Ram Charan #Europe #Final

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు