ఆర్ఆర్ఆర్ టార్గెట్ ఎంతో తెలుసా?  

Rrr Targets 1000 Crores-rajamouli,ram Charan,rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలను ఏర్పాటు చేసింది.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

RRR Targets 1000 Crores-Rajamouli Ram Charan Rrr

ఇక ఈ సినిమా కోసం బయ్యర్లు కూడా భారీ రేటు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో చిత్ర యూనిట్ లెక్కలు చూస్తే అందరూ నోరెళ్లబెట్టడం ఖాయం.ఎందుకంటే ఈ సినిమా ప్రీరిలీజ్ రూపంలోనే ఏకంగా రూ.600-రూ.700 కోట్ల మేర బిజినెస్ జరిగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.దీంతో ఈ సినిమా తక్కువలో తక్కువగా రూ.1000 కోట్ల మేర బిజినెస్ చేయడం ఖాయమని వారు అంటున్నారు.

మరి ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జరుగుతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇప్పటికే బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌ ఏర్పరుచుకున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరి ఆర్ఆర్ఆర్ మూవీ తన టార్గెట్‌ను ఎంత మేర అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు