ఊరించి ఉసూరుమనిపించిన తారక్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

 Rrr Surprise Of Ram Charan By Ntr Delayed-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.అయితే నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ప్లాన్ చేశాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో చరణ్ కోసం నేటి ఉదయం 10 గంటలకు ఓ సర్‌ప్రైజ్ బ్యాంగ్ ఉంటుందని వెల్లడించాడు.అయితే చరణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ గిఫ్ట్‌ అయ్యి ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ 10 గంటలు దాటినా ఆ గిఫ్ట్ ఏమిటో బయటకు రాలేదు.దీంతో తారక్ మరోసారి ట్వీట్ చేశాడు.

‘సారీ బ్రదర్.నీకు ఇద్దామనుకున్న సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఒపీనియన్ కోసం రాజమౌళికి పంపాను.

ఆయన ఒపీనియన్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా.!’ అంటూ తారక్ ట్వీట్ చేశాడు.

దీంతో చరణ్ గిఫ్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది.అయితే ఈ గిఫ్ట్‌ను నేటి సాయంత్రం రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

చరణ్‌ పాత్రకు సంబంధించి ఈ గిఫ్ట్ ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.మరి ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏమిటో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube