రాజమౌళిలో ఊహించని మార్పు.. సంతోషంలో చరణ్, తారక్..!

సాధారణంగారాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే స్టార్ హీరోలు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పూర్తిగా రాజమౌళి మూవీకి మాత్రమే సమయం కేటాయించాలి.షూటింగ్ పూర్తయ్యే వరకు ఒకే లుక్ లో కనిపించడంతో పాటు పాత్ర కోసం ఎంతైనా శ్రమించాలి.

 Rrr Stars Ntr And Charan Break Director   October 13  Rajamouli ,  Rrr,   Tarak-TeluguStop.com

దాదాపు అన్ని సినిమాలకు రాజమౌళి హీరోల విషయంలో ఇవే నిబంధనలను ఫాలో కాగా ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో మాత్రం జక్కన్న మారారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కు రాజమౌళి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి అనుమతులు ఇచ్చారు.

ఈ సినిమాలో సిద్ధా పాత్రలో చరణ్ కనిపించనున్నారు.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ జెమినీ ఛానెల్ కొరకు ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో చేస్తుండగా ఈ షో ప్రోమో షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.

ఇలా తారక్, చరణ్ వేరే సినిమాల, యాడ్ ల షూటింగ్ లో పాల్గొనడానికి రాజమౌళి అంగీకరించడం గమనార్హం.

Telugu Charan, October, Rajamouli, Tarak-Movie

ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ నెల 13వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని తారక్, చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.400 కోట్ల నుంచి 450 కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఖర్చు చేస్తుండగా సినిమా బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది.ఇప్పటివరకు కలెక్షన్లపరంగా బాహుబలి 2 రికార్డులు క్రియేట్ చేయగా ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులను క్రాస్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిజ జీవిత పాత్రలను తీసుకుని కల్పిత కథతో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల చరణ్.

తారక్ ఇతర షూటింగ్ లలో పాల్గొంటున్నా రాజమౌళి కూడా అడ్డు చెప్పడం లేదని సమాచారం.జక్కన్న షూటింగ్ కు అనుమతి ఇవ్వడంతో తరక్, చరణ్ కూడా సంతోషంగా ఉన్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube