‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌లుక్‌కు డేట్‌ ఫిక్స్‌, నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశే

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చిన్న పోస్టర్‌ కూడా అధికారికంగా బయటకు రాలేదు.

 Rrr Special Update About Ram Charan Birthday-TeluguStop.com

సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరగుతున్నా కూడా ఫస్ట్‌లుక్‌ను మాత్రం జక్కన్న విడుదల చేయడం లేదు.ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ల లుక్స్‌ ఎలా ఉంటాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Ramcharan, Rrr Latest, Rrr Ram Charan-Movie

ఎట్టకేలకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా మార్చి 27వ తారీకున అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.చరణ్‌ ఈ చిత్రంలో అల్లూరి పాత్రలో కనిపించబోతున్నాడు.ఇప్పటి వరకు మనకు అల్లూరి అంటే కృష్ణ గుర్తుకు వస్తాడు.

Telugu Ramcharan, Rrr Latest, Rrr Ram Charan-Movie

జక్కన్న తన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఇకపై అల్లూరి సీతరామరాజు అంటే రామ్‌ చరణ్‌ గుర్తుకు వచ్చేలా చేయడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు.మార్చి 27 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు.ఇక ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన పుట్టిన రోజు అయిన మే 20న విడుదల చేసే అవకాశం ఉంది.అంటే అల్లూరి వచ్చిన రెండు నెలలకు కొమురం భీం రాబోతున్నాడు.

ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నిరాశను కలిగించే విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube