ఆర్‌ఆర్‌ఆర్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ను ఆకాశానికి ఎత్తుతున్నారు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఆయన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

సినిమా కు సంబంధించిన అప్‌ డేట్స్ ను ఇవ్వడం కోసం ట్విట్టర్‌.ఇన్‌స్టా మరియు ఫేస్ బుక్‌ ల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ పేరుతో సోషల్‌ మీడియా అకౌంట్స్ ను క్రియేట్‌ చేయడం జరిగింది.

RRR Social Media Team Doing Good Work During Corona Time, Corona, Covid 19, Jakk

ఆ అకౌంట్స్‌ లో ఎప్పుడు సినిమా గురించి అప్‌ డేట్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూసేవారు.చిన్న అప్‌ డేట్‌ వాటి నుండి వస్తే చాలా పెద్ద విషయంగా చెప్పుకునే వారు.

కాని ఇప్పుడు ఆ అకౌంట్ లను నెటిజన్స్‌ లో కరోనా అవగాహణ కల్పించేందుకు ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ లు పోస్ట్‌ లు ఆర్ ఆర్‌ ఆర్‌ సోషల్‌ మీడియా టీమ్‌ షేర్‌ చేస్తున్నారు.

Advertisement

ఎక్కడ ఆక్సీజన్ కొరత ఉన్నా.ఎక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నా కూడా ఇతర ఏ సమాచారం అయినా ఆర్ ఆర్ ఆర్‌ టీమ్‌ తో షేర్‌ చేస్తే వారు వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి లక్షల మందికి అందేలా చేస్తున్నారు.

ఇలా ఎంతో మందికి ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీమ్‌ సాయం చేస్తున్నారు.ఇటీవల అందరు సినీ ప్రముఖులు మరియు సంస్థలకు చెందిన సోషల్‌ మీడియా పేజీలు ఈ విషయాలను షేర్‌ చేస్తున్నాయి.

ఇలా చేయడం వల్ల ఎంతో కొంత సాయం చేసినట్లుగా అవుతుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఈ అకౌంట్‌ లను ఫాలో అయ్యి అవసరం ఉన్నా సంప్రదించవచ్చు అంటున్నారు.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీమ్‌ చేస్తున్న పనిని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.జక్కన్న టీమ్‌ చేస్తున్న ఈ పనికి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు