ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోల డామినేషన్‌పై రచయిత ఫుల్‌ క్లారిటీ

మల్టీస్టారర్‌ చిత్రం అంటే ఖచ్చితంగా ఇద్దరు హీరోలను సమాన స్థాయిలో చూపించడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు.ఎంత సీనియర్‌ దర్శకుడు అయినా మల్టీస్టారర్‌ విషయంలో కాస్త తడబాటు తప్పదని గతంలో నిరూపితం అయ్యింది.

 Writer Sai Madhavu Burra Give The Clarity In Rrr Movie Hero's Chracters In That-TeluguStop.com

స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ విషయంలో ఆ తడబాటు వల్ల మొత్తం అస్థవ్యస్థంగా పరిస్థితి మారే ప్రమాదం ఉంది.అందుకే స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ అంటేనే దర్శకులు ముందుకు రావడం లేదు.

టాలీవుడ్‌లో దాదాపుగా రెండు మూడు దశాబ్దాల తర్వాత రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టాడు.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాలో ఖచ్చితంగా మా హీరోది డామినేషన్‌ అంటే మా హీరోది డామినేషన్‌ అంటూ మెగా నందమూరి ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే సోషల్‌ మీడియా వేదికగా దెబ్బలాడుకుంటున్నారు.

Telugu Nandamuri Fans, Rajamouli, Ramcharan, Tollywood-

తాజాగా ఆ విషయమై రచయిత సాయి మాధవ్‌ క్లారిటీ ఇచ్చాడు.సినిమాలోని ప్రతి సీన్‌లో కూడా ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది.ఇద్దరు హీరోల డైలాగ్స్‌ విషయంలో కూడా సమానమైన తూకం పాటించామంటూ పేర్కొన్నాడు.

రాజమౌళి ఇద్దరు హీరోలను బ్యాలన్స్‌ చేస్తూ సీన్స్‌ను షూట్‌ చేశాడు.కథలో ఇద్దరు హీరోలకు కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది.

కనుక ఫ్యాన్స్‌ ఎవరు కూడా నిరుత్సాహపడరంటూ క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube