కరోనా ఎఫెక్ట్‌తో ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం.. అవాక్కవుతున్న ఫ్యాన్స్!  

Rrr Release To Be Postponed Once Again Due To Corona Effect - Telugu Corona Effect, Ntr, Rajamouli, Ram Charan, Rrr

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వరైస్ కారణంగా అన్ని పనులు వాయిదా పడ్డాయి.దాదాపు కరోనా సోకిన అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి.

 Rrr Release To Be Postponed Once Again Due To Corona Effect

కాగా కరోనా ఎఫెక్ట్ వల్ల సినీ రంగంలోని అన్ని పనులు కూడా మూతపడ్డాయి.దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలే కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలపై కూడా ప్రభావం పడింది.

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ వచ్చే జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అంటే ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు.

కరోనా ఎఫెక్ట్‌తో ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం.. అవాక్కవుతున్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం సినిమా షూటింగ్ నిలిచిపోయింది.మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.

అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పడుతుంది.

దీంతో ఈ సినిమాను జనవరిలో కాకుండా 2021 జూలై 10న రిలీజ్ చేయాలని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోంది.

పైగా ఆ తేదీ తమకు చాలా లక్కీ అని చిత్ర యూనిట్ అంటోంది.అయితే అదే రోజున రిలీజ్ అయిన బాహుబలి చిత్రం ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

మరి ఆర్ఆర్ఆర్ కూడా బాహుబలి రిలీజ్ రోజునే వస్తుందా లేక ముందే వస్తుందా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rrr Release To Be Postponed Once Again Due To Corona Effect Related Telugu News,Photos/Pics,Images..