'ఆర్ఆర్ఆర్‌' డేట్‌ ను హైజాక్‌ చేయబోతున్న అఖండ

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్ ఆర్‌ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి దసరాకు ఈ సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు.

 Rrr Release Date Taken By Balakrishna Akhanda , Akhanda , Akhanda Relese Date ,-TeluguStop.com

కాని ఇప్పటి వరకు షూటింగ్‌ ను పూర్తి చేయని జక్కన్న ఎలా రెండు నెలల్లో సినిమాను విడుదల కు సిద్దం చేస్తాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటి వరకు దసరాకు సినిమాను అంటున్నారు.

కాని కొందరు మాత్రం ఖచ్చితంగా రాజమౌళి ఆ తేదీలో సినిమాను విడుదల చేయాలని అనుకోవడం లేదు.త్వరలోనే కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారు అంటూ స్పష్టం చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలను చూస్తే షూటింగ్‌ పూర్తి అయిన కొన్ని నెలల తర్వాత కూడా గ్రాఫిక్స్ వర్క్‌ కొనసాగింది.కనుక ఈ సినిమా కు కూడా ఖచ్చితంగా నాలుగు అయిదు నెలల సమయం కావాలి.

కనుక వచ్చే ఏడాది వరకు సినిమా ను వాయిదా వేయాల్సిందే అంటున్నారు.

ఒక వేళ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కనుక వాయిదా పడితే వెంటనే ఆ తేదీలో అఖండను విడుదల చేయాలని భావిస్తున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.వరుసగా అఖండ సినిమా పై అంచనాలు పెంచే విధంగా పోస్టర్ లు వీడియోలు వస్తూనే ఉన్నాయి.అతి త్వరలోనే బాలయ్య నుండి కొత్త పాటను వదలబోతున్నారు.బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి.

Telugu Akhanda, Balakrishna, Boya Pati, Tollywood-Movie

ఆ రెండు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఈ సినిమా ను కూడా అభిమానులు నమ్ముతున్నారు.భారీ క్రేజ్ ఉన్న సినిమాను మంచి తేదీన విడుదల చేస్తే బాగుంటుంది.అందుకే ఆర్ ఆర్‌ ఆర్ విడుదల తేదీని ఆక్రమించి దసరాకు వస్తామని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube