అల్లూరి సీతారామరాజుకు బాక్సింగ్‌ ఎందుకో?

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.చరణ్‌ అల్లూరిగా ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నట్లుగా సినిమా ప్రారంభంలోనే రాజమౌళి ప్రకటించాడు.

 Kick Boxer Share The Ramcharan Photo In Social Media About Rrr Charan Boxing, Ra-TeluguStop.com

కాని తాజాగా రామరాజు వీడియోను చూసిన తర్వాత అనేక రకాల అనుమానాలు జనాల్లో వస్తున్నాయి.ఆ వీడియోలో రామ్‌ చరణ్‌ను పోలీసుగా చూపించారు.

ఇప్పుడు బాక్సింగ్‌ నేర్చుకుంటున్నారు అంటున్నారు.

రామ్‌ చరణ్‌ రియల్‌ బాక్సింగ్‌ స్టార్స్‌ అయిన కులదీప్‌ మరియు నీరజ్‌ గొయాట్‌ల వద్ద కిక్‌ బాక్సింగ్‌కు సంబంధించిన టిప్స్‌ నేర్చుకున్నాడట.

తాజాగా కులదీప్‌ ఈ ఫొటోను షేర్‌ చేసి లాక్‌ లేకుండా ఉంటే బాగుండేది.ఈ స్టార్‌తో మరికొంత కాలం టైం స్పెండ్‌ చేసే అవకాశం వచ్చేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇక అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్‌ చరణ్‌కు బాక్సింగ్‌ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు అనుమానపు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Telugu Kickboxnig, Komaram Bheem, Kuldeep, Ramcharan-Movie

రాజమౌళి ఏం చేసినా అద్బుతంగా ఉంటుందని అంటారు.అలాగే ఈ సినిమా విషయంలో కూడా జక్కన్న చాలా లోతుగా ఆలోచించి కథను రెడీ చేశాడట.అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌లు కొంత కాలం కనిపించకుండా పోయారు.

వారు అలా పోయి ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు అనేది కథ.కనుక సినిమాలో వారు ఉద్యమకారులుగా మాత్రమే కాకుండా వేరే మాదిరిగా అంటే పోలీసుగా కూడా కనిపిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube