ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్‌లో అదే హైలైట్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rrr Climax To Have Super Highlight, Rrr, Ram Charan, Ntr, Rajamouli, Climax, Tol-TeluguStop.com

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో చాలా అంశాలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇందులో ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో కలిపి ఈ సినిమాను అదిరిపోయే రేంజ్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ క్లైమాక్స్‌లో తారక్, చరణ్‌ల యాక్టింగ్ ఆర్ఆర్ఆర్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.

ఇక తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube