మళ్లీ వాయిదా పడుతున్న ఆర్ఆర్ఆర్?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదరుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

 Rrr To Postpone Again Rrr, Rajamouli, Ntr, Ram Charan-TeluguStop.com

ఇక ఈ సినిమాను తొలుత జూలై 30న రిలీజ్ చేయాలని అనుకున్నా, అది కాస్త జనవరి 8కి వాయిదా పడింది.సినిమా షూటింగ్ మిగిలి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్‌ ఉండటంతో ఈ సినిమాను వచ్చే జనవరి 8కి వాయిదా వేశారు చిత్ర యూనిట్.

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా రామ్ చరణ్, ఆలియా భట్‌ల మధ్య వచ్చే సీన్స్‌న ఏప్రిల్ 15 నుండి షూట్ చేయాలని రాజమౌళి అనుకున్నారు.కానీ ఈ లాక్‌డౌన్ మరింత పొడిగించే అవకాశం కనిపిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ వాయిదా వేశారు.

దీంతో సినిమా రిలీజ్‌ను కూడా జనవరి నుండి వాయిదా వేస్తారా అనే ప్రశ్న ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.మరి ఈ సినిమా రిలీజ్ నిజంగానే వాయిదా పడుతుందా? లేక అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube