ఆర్ఆర్ఆర్‌లో ఆ విలన్‌కు అంత ముట్టిందా..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

 Samuthirakani Remuneration For Rrr, Samuthirakani, Rrr, Rajamouli, Ntr, Ram Char-TeluguStop.com

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఇందులో ఇతర భాషలు చెందని నటీనటులు కూడా నటిస్తున్నారు.ఇందులో భాగంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు తమిళ నటుడు సముథ్రకని.

తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సముథ్రకని, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో విలన్ పాత్రలో నటించి అలరించాడు.కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో ఆయన నటిస్తుండటంతో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమా కోసం ఆయన ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే అంశంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.కాగా ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆయన ఈ సినిమా కోసం ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమాలో సముథ్రకని ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube