ఆర్ఆర్ఆర్ సీన్ రివర్స్.. ఇప్పుడు జక్కన్న వంతు!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Rrr Heroes Waiting For Rajamouli To Start Shooting, Rrr, Ntr, Ram Charan, Rajamo-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకోగా కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.

అయితే కరోనా ప్రభావం తగ్గే వరకు సినిమా షూటింగ్‌లో పాల్గొనేది లేదని చిత్ర హీరోలు గతంలో తెలపడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

అయితే ఈ సినిమా దర్శకుడు రాజమౌళికి ఇటీవల కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం తన ఫాం హౌజ్‌లో చికిత్స తీసుకుంటున్నాడు.దాంతో పాటు ఈ సినిమా నిర్మాత దానయ్యకు కూడా కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ డైలమాలో పడింది.

అయితే ఈ చిత్ర హీరోలు ఇప్పుడు సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

కానీ ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈ సినిమా తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తారక్ కొమురం భీం పాత్రలో, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube