చెమటోడుస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్  

Rrr Ntr Ram Charan Rajamouli Graphics - Telugu Dvv Danayya, Graphics, Ntr, Rajamouli, Ram Charan, Rrr

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

 Rrr Ntr Ram Charan Rajamouli Graphics

ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను జక్కన్న షేక్ చేయాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్‌కు కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను వేసవి ముగిసే సరికి పూర్తి చేసి ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా వారంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

చెమటోడుస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయినా కూడా వారు తీరిక లేకుండా చెమటోడుస్తున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ లాక్‌డౌన్‌ను పూర్తిగా వినియోగించుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.పలువురు స్టార్ టెక్నీషియన్స్ ఈ పనులను ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rrr Team Busy In Graphics Work Related Telugu News,Photos/Pics,Images..