ఆ రోజు ఫ్యాన్స్‌కు నిజమైన పండగే అంటోన్న ఆర్ఆర్ఆర్  

Rrr Ntr Rajamouli - Telugu First Look, Ntr, Rajamouli, Ram Charan, Rrr

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు.

 Rrr Ntr Rajamouli

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవల చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక తారక్ పుట్టినరోజున కొమురం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ బర్త్‌డే పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

ఆ రోజు ఫ్యాన్స్‌కు నిజమైన పండగే అంటోన్న ఆర్ఆర్ఆర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ తారక్ పుట్టినరోజున ఆర్ఆర్ఆర్ నుండి ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మాత్రం ఫ్యాన్స్ నిరాశకు లోనవ్వాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అనుకున్న మేర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయలేకపోయామని, త్వరలోనే అదిరిపోయే రేంజ్‌లో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుందని తెలిపింది.అందరి అంచనాలను తారుమారు చేసేలా ఈ ఫస్ట్ లుక్ ఉండబోతుందని, ఆ రోజు ఫ్యాన్స్‌కు నిజమైన పండగలా ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ కోసం జక్కన్న అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారనే విషయం మాత్రం తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు