లాక్‌డౌన్‌లో చెమటోడుస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rrr Heroes Working Hard In Lockdown Time, Rrr, Ntr, Lockdown, Ram Charan, Rajamo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమాలోని హీరోలకు చాలా కష్టం వచ్చి పడింది.

మిగతావారు లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఎంజాయ్ చేస్తుంటే, ఈ హీరోలు మాత్రం చెమటోడుస్తున్నారు. లాక్‌డౌన్ ముందు ఆర్ఆర్ఆర్ హీరోలు ఫిజిక్ పరంగా చాలా ఫిట్‌గా ఉండాలని రాజమౌళి సూచించడంతో అప్పటికే వారు జిమ్‌లో చెమటోడ్చారు.

అయితే లాక్‌డౌన్ కారణంగా తమ ఫిట్‌నెస్ పోకుండా ఉండాలని రాజమౌళి ఆర్డర్ వేయడంతో వారు ఇంట్లోని జిమ్‌లో కూడా చెమటోడేస్తున్నారు.

దీంతో లాక్‌డౌన్‌లోనూ ఈ ఇద్దరు హీరోలు తెగ కష్టపడుతూ తమ సత్తా చాటుతున్నారు.

గతంలో బాహుబలి చిత్రం సమయంలోనూ ప్రభాస్, రానాలు ఫిట్‌గా ఉండాలని జక్కన్న కఠినంగా ఉండటంతో ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఆర్ఆర్ఆర్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడట.లాక్‌డౌన్ సమయం ముగిసే సరికి ఇద్దరు హీరోలు కూడా ఏమాత్రం ఫిజిక్ కోల్పోయినా మళ్లీ సమయం పడుతుందని రాజమౌళి వారిని హెచ్చరించాడు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను ఇక నిర్విరామంగా జరిపేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube