ఆర్‌ఆర్‌ఆర్‌లో దేవసేన వార్తలపై క్లారిటీ  

Rrr Movie Unit Clarity About Anushka Role-nrr And Ram Charan,rajamouli,rrr Movie

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి రోజు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు నటిస్తున్న ఈ చిత్రం వారి గాయాల కారణంగా కాస్త గ్యాప్‌ తీసుకోవడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఎక్కువ శాతం ఈ చిత్రం షూటింగ్‌ ఉంటుందని తెలుస్తోంది. అక్కడ పలు లొకేషన్స్‌లో సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..

ఆర్‌ఆర్‌ఆర్‌లో దేవసేన వార్తలపై క్లారిటీ-RRR Movie Unit Clarity About Anushka Role

ఈ సమయంలోనే ఈ సినిమాలో బాహుబలి స్టార్‌ దేవసేన అనుష్క నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆలియా భట్‌తో పాటు నిత్యామీనన్‌, అనుష్కలు ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో అనుష్క నటించడం లేదని తేలిపోయింది.

అసలు అనుష్కతో చర్చలు జరపలేదని, ఆమెకు ఈ సినిమాకు సంబంధం లేదు అంటూ యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చేసింది. అనుష్క ఉంటే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉంటుందేమో, వారు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. కాని వాటిల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు.

అనుష్క దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి గ్యాప్‌ తీసుకుని రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. భాగమతి చిత్రం తర్వాత బరువు తగ్గేందుకు అనుష్క పూర్తి విశ్రాంతి తీసుకుంది. చాలా కష్టపడి కాస్త బరువు తగ్గి మళ్లీ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈమె చిత్రం జూన్‌లో ప్రారంభం కాబోతుంది.

పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో అనుష్క తమిళంలో కూడా ఒక చిత్రంను స్టార్‌ హీరోతో కలిసి నటించబోతుంది. త్వరలోనే ఆ సినిమాపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..