వీడియో : ఆర్‌ఆర్ఆర్ మరో మైండ్ బ్లోయింగ్ విజువల్

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల కు సిద్దం అయ్యింది.భారీ అంచనాలున్న ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెంచేందుకు అన్నట్లుగా ట్రైలర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Rrr Movie Trailer Visuals Back To Back Release, Rrr Movie , Trailer Visuals ,-TeluguStop.com

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు మరియు రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ ను దక్కించుకోవడం లక్ష్యంగా ఈ సినిమా మరియు ట్రైలర్ లు రాబోతున్నాయి.ట్రైలర్‌ కోసం జనాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు హైప్ క్రియేట్‌ చేసే విధంగా ప్రతి రోజు ఏదో ఒక పోస్టర్ లేదా వీడియోను షేర్‌ చేస్తున్నారు.

నిన్న మొదటగా ఎన్టీఆర్‌ పోస్టర్ ను విడుదల చేయగా ఆ తర్వాత రామ్‌ చరణ్‌ పోస్టర్ ను విడుదల చేశారు.ఇద్దరి పోస్టర్ ల్లో సిక్స్ ప్యాక్‌ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక నేడు ఉదయం రామ్‌ చరణ్ వీడియోను షేర్‌ చేశారు.ఈ వీడియోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశాడు.

సాయంత్రం రామ్‌ చరణ్‌ ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోను చూపించబోతున్నాడు.రామ్‌ చరణ్‌ పాత్ర అల్లూరిని ఎప్పడు కూడా ఫైర్ తో పోల్చుతున్నాడు.

కనుక ఈసారి కూడా ఫైర్‌ నుండి చరణ్ వస్తున్నట్లుగా చూపించాడు.

ఇక ఎన్టీఆర్‌ ను నీటితో  పోల్చుతున్నారు.కనుక ఎన్టీఆర్‌ పాత్ర కు సంబంధించిన వీడియోను నీటితో తీసుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.మొత్తానికి రామ్‌ చరణ్‌ నిన్నటి పోస్టర్ తో పాటు నేటి విజువల్‌ కూడా మైండ్‌ బ్లోయింగ్‌ అన్నట్లుగా ఉంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న చిన్న వీడయో బిట్స్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube