ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌ గురించి కొన్ని ఆసక్తికర పుకార్లు

Rrr Movie Trailer Coming Soon

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా కు సంబంధించిన టీజర్ మరియు పాటలు ఇప్పటికే వచ్చాయి.

 Rrr Movie Trailer Coming Soon-TeluguStop.com

కానీ ట్రైలర్ కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్‌ మరియు రామ్ చరణ్ అభిమాను లు ఖచ్చితం గా ఈ ట్రైలర్ అద్బుతంగా ఉంటుందంటూ నమ్మకంగా ఉన్నారు.

ట్రైలర్ తో సినిమా స్థాయిని మరింత పెంచడం ఖాయం అంటున్నారు.కచ్చితంగా ట్రైలర్ లో విజువల్స్ కళ్లు అలా తెరుచుకునేలా ఉంటాయని అంటున్నారు.

 Rrr Movie Trailer Coming Soon-ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌ గురించి కొన్ని ఆసక్తికర పుకార్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ ఆర్ ఆర్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపుగా నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

మూడు గంటలకు పైగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ మూడు నిమిషాల రెండు సెకన్లు ఉందట.ఈ మూడు నిమిషాల్లో మూడు గంటల సినిమా ను చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ట్రైలర్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదని సినిమా మరో రేంజ్ కి వెళ్లి పోతుంది అని అంటున్నారు.ఇటీవల వచ్చిన కొన్ని సెకన్ల విజువల్స్ తోనే హాలీవుడ్లో కూడా ఈ సినిమా గురించి చర్చించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు మూడు నిమిషాల ట్రైలర్‌ తో అక్కడ ఇక్కడ చర్చలు జరుగుతాయి అంటూ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అద్భుతమైన విజువల్స్ తో పాటు ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునే మాటలు పాటలు సన్నివేశాలు ఇలా అన్నీ ఉంటాయని అందరూ నమ్మకంగా ఉన్నారు.సంక్రాంతికి రాబోతున్నాయి రాబోతున్న ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

#Ram Charan #RRR Trailer #Alia Bhatt #Raja Mouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube